Sacrificing star Sunisith: సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వొచ్చు అనడానికి నిదర్శనం ఈ సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్. గతంలో లావణ్య త్రిపాఠితో నా పెళ్లయింది ప్రస్తుతం విడిపోయాము, తమన్నా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది అంటూ ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ సాక్రిఫైసింగ్ స్టార్ ఇపుడు సినిమాల గురించి కాకుండా పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. తాను బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు జనసేనలో పనిచేస్తున్నట్లు చెప్తున్న ఇతను ఏ రాష్ట్రంలో పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూ చేసిన వాడికే మెంటల్ ఎక్కించేసాడు. ఇక తెరాస ప్రభుత్వం మీద ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించిన మనోడు మాజీ సీబిఐ ఉద్యోగి అంటూ చెప్పారు.

నిజాలు బయటికి వస్తాయని నన్ను అరెస్టు చేశారు…
లావణ్య త్రిపాటి భర్త నేనంటూ చెప్పిన సునిశిత్ ను గతంలో పోలీసులు అరెస్టు చేసి జైల్లో 40 రోజులకు పైగా ఉంచారు. దీని గురించి మాట్లాడుతూ లావణ్య తనకు మళ్ళీ 2019 లో టచ్ లోకి వచ్చింది అయితే అప్పటికే మా మధ్య దూరం పెరగడం వల్ల నేను కలవనని చెప్పానని చెప్పాడు.

ఇక ఢిల్లీ లో వెళ్లి అక్కడ రాజకీయాలు చేయొచ్చు కానీ అక్కడ ఒంటరిగా దొరికితే తెరాస వాళ్ళు వైసీపీ వాళ్ళు నన్ను వదలరు నన్ను కిడ్నాప్ చేసి చంపేస్తారు అంటూ చెప్పాడు. మాజీ సీబిఐ ఉద్యోగి అవడం వల్ల తనకు చాలా మంది విషయాలు తెలుసని అందుకే వైసీపీ వాళ్ళు గతంలో ఒకసారి కిడ్నాప్ చేశారంటూ చెప్పాడు. ఇక తెలంగాణ లో నా సపోర్ట్ బీజేపీకి ఇస్తాను అంటూ కెసిఆర్ పాలన బాగా లేదంటూ చెప్పాడు సునిశిత్.


































