Sai Dharam Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఫ్యామిలీగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు మెగా హీరోలు. ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మందికి సహాయ సహకారాలను చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు.

ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందిస్తూ వారికి తమదైన శైలిలో సహాయం అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ కార్మికులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే మెగా కుటుంబం వారిని ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పావలా శ్యామల ప్రస్తుతం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఈమె కుమార్తె కూడా అనారోగ్య సమస్యలతో బాధపడటంతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈమెకు ఆర్థిక సహాయం చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఏకంగా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తాజాగా మామ బాటలోనే అల్లుడు సాయి ధరమ్ తేజ్ సైతం పావలా శ్యామలకు అండగా నిలిచారు.
లక్ష రూపాయలు..
తాజాగా ఆమె ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న సాయి తేజ్ తనకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇలా సాయి తేజ్ సహాయం చేయడంతో ఈమె ఎమోషనల్ అయ్యారు. గతంలో నా కుమార్తెకు ఆపరేషన్ జరిగినప్పుడు సాయిధరమ్ తేజ్ ఫోన్ చేసి పరామర్శించారని తనని కలుస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకు కలవలేదు. దీంతో తనని మర్చిపోయారేమో అనుకున్నాను కానీ బాబు గుర్తు పెట్టుకొని మరి నాకు సహాయం చేశారని, ఆయనకు నా ధన్యవాదాలు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.






























