Sai Dharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు పవన్ పేరు వింటేనే ఎంతోమంది అభిమానులకు పూనకం వస్తుందని చెప్పాలి అంతలా ఈయన అభిమానులను సంపాదించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయి అంటే ఆ సంగతే మరో లెవల్ లో ఉంటుందని చెప్పాలి. ఇలా సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక రాజకీయాల విషయానికి వస్తే ఈయనని విమర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈయనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చాలామంది దత్తపుత్రుడు ప్యాకేజి స్టార్ మూడు పెళ్లిళ్లు స్టార్ అంటూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ మాటలు విన్నటువంటి పవన్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ విమర్శలు కురిపిస్తుంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి ధరమ్ ఇదే ప్రశ్న ఎదురయింది.
మావయ్యను చాలామంది వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటూ ప్రశ్నించారు.మామయ్యను ఇలా వ్యక్తిగత విషయాల ద్వారా అవమానిస్తూ ఉండడం చాలా బాధ కలుగుతుంది. అయితే మేము వాటిపై రియాక్ట్ అవ్వలేక సైలెంట్ గా ఉండడం లేదు మామయ్య చెప్పిన బాటలోనే మేము నడుస్తున్నాం కాబట్టి సైలెంట్ గా ఉన్నామని సాయి ధరంతేజ్ తెలిపారు.

Sai Dharam Tej: ఇలా ఉంటుందని మామయ్య ముందే చెప్పారు…
మామయ్య పాలిటిక్స్ లోకి వచ్చేముందు నన్ను వైష్ణవ్ వరుణ్,చరణ్ అందరిని పిలిచి నేను పాలిటిక్స్ లోకి వెళ్తున్నాను అక్కడికి వెళ్లిన తర్వాత చాలామంది నన్ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విషయాల గురించి కూడా విమర్శిస్తారు అలా విమర్శించినప్పుడు మీరు ఎవరు రియాక్ట్ అవ్వద్దు ఒకవేళ రియాక్ట్ కావాలి అనుకుంటే రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన చేసుకుని రాజకీయాలలోకి రండి అని తెలిపారు.మీ సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుందని నాకు తెలుసు కానీ అక్కడ ఏం జరిగినా మీరు రియాక్ట్ అవ్వద్దు మీ కెరియర్ మీ ప్రొఫెషన్ వదిలి మీరు బయటకు రావద్దు అని చెప్పారు అందుకే మౌనంగా ఉన్నామని ఈ సందర్భంగా తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.