Sai Dharam Tej: ఈసారి ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి వైఎస్ఆర్సిపి పార్టీ ఒకవైపు మరోవైపు బిజెపి జనసేన మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు.

ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతోనే పార్టీలపరంగా చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈసారి ఈయన కాపులు అత్యధికంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎలాగైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అందుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలో బిజీగా ఉండగా పిఠాపురంలో మాత్రం జనసేన తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి ఇప్పటికే జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు సినిమా సెలబ్రిటీలు మెగా హీరోలందరూ కూడా పిఠాపురం చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా హీరోలు అయినటువంటి వరుణ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
రంగంలోకి సాయిధరమ్ తేజ్..
ఇకపోతే మరొక మెగా హీరో అయినటువంటి సాయిధరమ్ తేజ సైతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. మే నాలుగు నుంచి ఆరో తేదీ వరకు మూడో రోజులపాటు ఈయన ప్రచార కార్యక్రమాలలో నిర్వహించనున్నారు. పిఠాపురం మచిలీపట్నం కాకినాడలో ఈయన ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని అందుకు అన్ని సిద్ధం చేశారని తెలుస్తోంది





























