Sai dharam tej : మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ది డిఫరెంట్ స్టైల్ అనొచ్చు. మామ చిరంజీవి లాగానే వేసే డాన్సులో గ్రేస్ ఉంటుంది ఈ మెగా మేనల్లుడికి. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ సొంత గుర్తింపుతో దూసుకెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇంతలోనే ఎవరూ ఊహించని పరిణామం సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్, ముందు చిన్నదే అనుకున్న తర్వాత అది ఎంత పెద్ద ప్రమాదం అనేది అందరికీ అర్థమైంది. ఆ ప్రమాదం తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ హీరోగా మన ముందుకు వస్తాడా అని అందరూ అనుకున్న సమయంలో మళ్ళీ హీరోగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా తాను నటించిన ‘విరూపాక్ష’ సినిమా సూపర్ హిట్ అయి సాయి ధరమ్ తేజ్ కి బూస్ట్ అప్ ఇచ్చింది. అయితే సాయి ధరమ్ తేజ్ కుటుంబంలో ఒక ఇంట్రస్టింగ్ విషయం ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయింది.

తల్లికి మళ్ళీ పెళ్లి చేసిన కొడుకులు…
సాయి ధరమ్ తేజ్ హీరోగా మంచి హిట్స్ అందుకుంటూనే తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ మైంటైన్ చేస్తూ అలరిస్తుంటే తమ్ముడు వైష్ణవి తేజ్ కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేసాడు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమా తరువాత మంచి హిట్స్ లేని వైష్ణవ్ తేజ్ తాజాగా ‘ఆదికేశవ’ అంటూ శ్రీలీల తో రాబోతున్నాడు. అయితే సాయి, వైష్ణవ్ ల తల్లి మెగాస్టార్ చెల్లి విజయదుర్గ గురించి ఒక ఆసక్తికర విషయం ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదే ఆమె రెండో పెళ్లి.

విజయదుర్గ గారికి శివ ప్రసాద్ అనే వ్యక్తితో మొదట వివాహం జరిగినా కొంతకాలనికే మనస్పర్తల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఒంటరిగానే పిల్లలు ఇద్దరినీ పెంచిన విజయదుర్గ గారు పిల్ల కోసం ఆమె జీవితాన్ని త్యాగం చేసారు. అయితే ఆమె కోసం సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. తమ తల్లి ఒంటరిగా ఉండకూడదు. ఈ వయసులో తనకు ఒక తోడు ఉండాలని భావించి తమ తల్లిని ఒప్పించి కేర్ హాస్పిటల్ కి చెందిన ఒక డెంటిస్ట్ కి ఇచ్చి పెళ్లి చేసారు.































