Sai pallavi: సహజ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళం, భాషలలో ఎన్నో సూపర్ సినిమాలలో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో దగ్గుబాటి రానాకి జోడిగా సాయి పల్లవి నటించింది. ఈ సినిమా ఈ నెల 17 వ తేదీ విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చాంశనీయంగా మారాయి. కాశ్మీరీ పండిట్ ల హత్యలను, గోవులను అక్రమంగా రవాణా చేసే ఒక మతానికి చెందిన వ్యక్తిని కొట్టడం…రెండూ ఒకే అంటూ సాయి పల్లవి వ్యాఖ్యలు చేసింది. దీంతో సాయి పల్లవి విమర్శలను ఎదుర్కొంటోంది. గోవులను హత్య చేసేవారిని, కాశ్మీరీ పండిట్ లతో పోల్చటం ఏంటి అంటూ ఒక వర్గం వారు సాయి పల్లవి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. దీంతో సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా బాయ్‌కాట్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. ఈ సంఘటన వల్ల సాయి పల్లవి వంశ చరిత్ర గురించి తెలుసుకోవటానికి కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ సాయి ఇటీవల సాయి పల్లవి భాష చరిత్రకి సంబంధించిన వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో సాయి పల్లవి వంశ చరిత్ర గురించి క్షుణ్ణంగా వివరించాడు.
భారీ ఎత్తున వలసవచ్చిన బడగ వంశస్థులు..
సాయి పల్లవి తమిళనాడులోని నీలిగిరి ప్రాంతానికి కోటగిరి అనే ప్రాంతం .వీరు మైసూరు ప్రాంతంనుంచి వలస వచ్చి కోయంబత్తూర్ లో సెటిల్ అయ్యారు. ఆ కాలంలో టిప్పు సుల్తాన్ మతం మారని వారిని చంపేస్తున్న నేపథ్యంలో బారీ ఎత్తున వలస వచ్చి వీరి పూర్వీకులు అడవుల్లో తల దాచుకున్నారు. వీరినే బడగ జాతి వారు అంటారు. వీరి అరణ్యవాసానికి ముఖ్యకారణం టిప్పు సుల్తాన్ ఈ విధంగా సాయి పల్లవి బడగ వంశ చరిత్ర గురించి జర్నలిస్ట్ సాయి వెల్లడించారు.
































