Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ ఏడాది వరుసగా రెండు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టారు. అదేవిధంగా డిసెంబర్ 24వ తేదీ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయంలో సాయిపల్లవి హీరోయిన్లుగా శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ విడుదలయ్యి మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. సాయి పల్లవి ఇందులో దేవదాసి పాత్రలో నటించారు. ఎప్పటిలాగే ప్రతి సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇదిలా ఉండగా సాయిపల్లవి ఈ సినిమా విడుదలైన తర్వాత తన చుట్టూ ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేకుండా ఒక పెద్ద సాహసానికి ఒడిగట్టారు.

ఈ క్రమంలోని ఈ సినిమా థియేటర్ ల వద్ద ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏకంగా ఈమె బుర్ఖా ధరించి హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ కి వెళ్లారు. అయితే బుర్ఖాలో ఉన్న సాయి పల్లవిని ఎవరు గుర్తించలేదు. సినిమా పూర్తయిన తర్వాత సాయి పల్లవి బయటకు రాగానే బయట ఒక రిపోర్టర్ సరాసరి సాయిపల్లవి దగ్గరకు వెళ్లి సినిమా ఎలా ఉంది అని తనని అడిగారు.
కారు ఎక్కిన తర్వాత ఐడెంటిటీ రివిల్ చేసిన సాయి పల్లవి:
ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సరాసరి కారులోకి వెళ్ళిన తర్వాత సాయి పల్లవి తన
ఐడెంటిటీ రివీల్ చేయడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయిపల్లవి ఈ విధంగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగడం కష్టం. ఈమెను ఎవరు గుర్తించలేదు కనుక సరిపోయింది అదే కనుక ఒకవేళ గుర్తుపట్టి ఉంటే అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ఎంతో కష్టతరం అయ్యేదని పలువురు భావిస్తున్నారు. మరి కొంతమంది ఈ సినిమా ప్రమోషన్ లో ఇది ఒక భాగమేనని వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.





























