Saidharam Tej: మెగా హీరో సాయి ధరంతేజ్ గత రెండు సంవత్సరాలు క్రితం కేబుల్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ప్రమాదానికి గురైన సమయంలో అటుగా వెళుతున్నటువంటి సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి గమనించి వెంటనే స్పందించి సాయిధరమ్ తేజ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.

ఇలా యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే స్పందించడంతో సాయి ధరమ్ తేజ ప్రాణాలతో తిరిగి బయటపడ్డారు లేదంటే చాలా పెద్ద ప్రమాదం చోటుచేసుకునేదని చెప్పాలి. అయితే సాయి ధరంతేజ్ తిరిగి కోలుకొని ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్నారు. తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సయ్యద్ అబ్దుల్ గురించి ప్రస్తావన వచ్చింది.
ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ తన గురించి మాట్లాడుతూ తన ప్రాణాలు కాపాడిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి తన మానవత్వాన్ని వెలగట్టలేనని అందుకే నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ సహాయం కావాలన్నా తనని అడగమని తనకోసం తాను ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానంటూ సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. ఇలా ఈ వార్తలు వైరల్ కావడంతో మీడియా సయ్యద్ అబ్దుల్ ను సంప్రదించింది.

Saidharam Tej: నాకు ఎలాంటి సహాయం చేయలేదు…
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ నన్ను కలిసి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారని వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు. ఇవన్నీ ఒట్టి అవాస్తవాలేనని ఆయన కానీ తన కుటుంబం గానీ ఎవరు నన్ను కలవలేదని తనకు ఎలాంటి సహాయం చేయలేదని తెలిపారు.ఇకపోతే మెగా ఫ్యామిలీ తనకు సహాయం చేశారంటూ వార్తలు రావడంతో తన కొలీగ్స్ అందరూ నన్ను జాక్పాట్ కొట్టావు భారీగా డబ్బు అందుకున్నావ్ అంటూ టార్చర్ చేశారని ఆ టార్చర్ భరించలేక ఉద్యోగం కూడా మానేశానని తెలిపారు.ఒకవేళ సాయి ధరమ్ తేజ్ పిలిస్తే తాను వెళ్తానని ఈ సందర్భంగా అబ్దుల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































