Saidharam Tej: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి సినిమా ప్రమోషన్ల సమయంలో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే మెగా హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తీక్ దండు,హీరో సంయుక్త మీనంతో పాటు సాయి ధరమ్ తేజ్ సైతం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
ఈ ప్రోమోలో భాగంగా సాయిధరమ్ తేజ్ యాంకర్ సౌమ్యరావు పై సెటైర్లు వేస్తూ ఆమె పరువు మొత్తం తీశారు. ఈ కార్యక్రమంలో సౌమ్యరావు చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబై కనిపించడంతో ఆమెను చూస్తున్నటువంటి సాయి ధరంతేజ్.. ఏంజెల్ ఇలా చీర కట్టుకొని రావడం మొదటిసారి చూస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు.

Saidharam Tej: మిమ్మల్ని కాదు అన్నది..
సాయి ధరంతేజ్ ఇలా కామెంట్ చేయడంతో యాంకర్ సౌమ్యరావు తెగ సిగ్గుపడుతూ మురిసిపోయింది. అయితే వెంటనే సాయి ధరమ్ తేజ్ నేను అన్నది మిమ్మల్ని కాదు అంటూ పంచ్ వేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వడంతో సౌమ్య రావు మొఖం చిన్న బుచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

































