Saidharam Tej: మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుప్రీం హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి ధరంతేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమాతో పాటు ఈయన పవన్ కళ్యాణ్ తో కలిసి మరో రీమేక్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా కూడా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే విరూపాక్ష సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్ ను ప్రశ్నిస్తూ…పవన్ కళ్యాణ్ మీరు రీమేక్ సినిమాలో కాకుండా ఒరిజినల్ సినిమాలో చేయొచ్చు కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాయి తేజ్ సమాధానం చెబుతూ ఈ విషయం పవన్ కళ్యాణ్ మామయ్యకి తెలుసని తెలిపారు.
ఇకపోతే ఇది రీమేకా… కాదా అనే విషయాలను పక్కన పెడితే నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన వ్యక్తితో కలిసి నటించే, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుని అవకాశం రావడం నిజంగా నా అదృష్టం ఇలాంటి ఒక అవకాశాన్ని తాను అసలు వదులుకోనని తెలిపారు. ఇక ఇలాంటి అదృష్టం తనకు వచ్చినప్పుడు అది రీమేక్ సినిమానా… ఒరిజినల్ సినిమానా అనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోనని తెలిపారు.

Saidharam Tej:సంతోషం మాటల్లో వర్ణించలేనిది…
పవన్ మామయ్యతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు నాకు కలిగిన సంతోషం మాటలలో వర్ణించలేనిదని తెలిపారు. ఇక ఈ సినిమా రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ సినిమాకు ఈ సినిమాకు ఏ మాత్రం పోలిక ఉండదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పెద్ద ఎత్తున మార్పులు చేశామని ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































