మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటివలె రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ మళ్లీ బయటకు రావడం మొదలు పెట్టారు. సాయి తేజ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా 26న జీ 5 లో ఓటీటీ కానున్న సందర్భంగా తన అభిమానులకు ఆడియో సందేశం పంపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నిన్న అనగా నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా జీ5 ఓటీటీ వేదికలో విడుదల అయింది.
ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూడలేకపోయానని, అందువల్ల ఓటీటీ వేదికగా అందరూ కలిసి చూద్దాం. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలపండి అంటూ అభిమానులను కోరారు సాయి ధరమ్ తేజ్. చెప్పిన విధంగానే దర్శక నిర్మాతలతో కలిసి సినిమాని చూశాడు సాయి ధరమ్ తేజ్. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Firstly, Thank you all for the love you’re showering for #RepublicOnZee5.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 26, 2021
This Friday remains very special for me as I have loved playing Panja Abhiram and yearned to watch with you all.
I am watching with team and happy to see you all joining in ????#Republic pic.twitter.com/DMgP573tGL
సాయి తేజ్ తో పాటుగా దర్శకుడు దేవా కట్టా, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, ప్రొడ్యూసర్ సతీష్ బీకెఎఆర్, జి స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయ లతో కలిసి ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి తేజ్ అభిమానులు అతడు త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలలో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు






























