Saipallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా, నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి ప్రస్తుతం ఎలాంటి తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే ఈమె హీరోయిన్ గా ఎంతో విభిన్నమైన కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి తెలుగులో చివరిగా విరాటపర్వం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ నిర్మాణంలో హీరో శివ కార్తికేయన్ కి జోడిగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ తెలుగు సినిమాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇకపోతే సాయి పల్లవి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈమె ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కి భార్య పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఇందులో ఎన్టీఆర్ ద్విపత్రాభినయంలో నటిస్తున్నారని ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలో కనిపించడంతో తండ్రి పాత్రలో నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ కి సాయి పల్లవి భార్యగా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

Saipallavi: అవన్నీ అవాస్తవాలే…
ఈ విధంగా సాయి పల్లవి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో చిత్ర బృందం ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.సాయి పల్లవి దేవర సినిమాలో ఎన్టీఆర్ కి భార్య పాత్రలో నటిస్తుంది అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలన్ని పూర్తిగా ఆవాస్తవమేనంటూ ఈ వార్తలను కొట్టి పారేశారు. దీంతో సాయి పల్లవి ఎన్టీఆర్ సినిమాలో నటించలేదనే క్లారిటీ వచ్చేసింది.
Here is the Clarification about the rumour of Sai Pallavi would act in #Devara!!
A Big NO. Tweet Deleted ????????@tarak9999 @DevaraMovie https://t.co/B7UFflkMNS
— NTR Fans Guntur (@NTRFansGuntur) June 26, 2023
































