సమంత, శర్వానంద్ “జాను” సినిమా రివ్యూ !!

0
1809

హీరో శర్వానంద్, టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని జంటగా నటించిన చిత్రం జాను. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం, తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు రీమేక్. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించగా.. “96” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ “జానూ” సినిమాకి కూడా ఈయనే దర్శకుడిగా కొనసాగారు. ఆ చిత్రానికి మ్యూజిక్ అందించిన గోవింద వసంత ఇక్కడ కూడా సంగీతం చేసారు. అయితే ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా కధ ఏమిటి? “జాను” గా సమంత మెప్పించిందా ? తన నటనతో శర్వానంద్ ప్రేక్షకులను మరిపించగలిగాడా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగునాట రీమేక్ ల పర్వం నడుస్తుంది. ఇది వరకు చాలా సినిమాలు ఇక్కడ రీమేక్ అయ్యాయి. అయితే రీమేక్ అయినా సినిమాలు అన్నీ హిట్ అవుతాయని గ్యారెంటీ లేదు. కానీ మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే రీమేక్ సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. ఇదివరకే ఇది చాలా సార్లు రుజువయ్యింది. అయితే రీమేక్ సినిమాలకు ఉన్నన్ని కష్టాలు, కంపేరిజన్లు రెగ్యులర్ సినెమాలకు ఉండవు. సినిమా కథతో పాటుగా ఇక్కడ నేటివిటీకి తగ్గట్టుగా కొంచెం మార్పులు చేర్పులు చేస్తుంటారు దర్శకులు. అందులో తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా అక్కడ విజయ్ సేతుపతి నటనకు, ఇక్కడ శర్వానంద్ నటనను పోల్చడం మొదలుపెడతారు. అక్కడ కథానాయికగా నటించిన త్రిష నటనకు ఇక్కడ సమంత నటనను పోల్చడం వంటివి నాచురల్ గానే జరుగుతుంటాయి. వీటి గురించి లోతుగా విశ్లేషణకూడా సోషల్ మీడియాలో మొదలైంది.

ఇన్ని విశ్లేషణలు, పోలికల మధ్య “జాను” ప్రేక్షకులను ఆకట్టుకోవడం మెమోలు విషయంకాదు. ఇక కథలోకి వెళితే లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటతో మొదలైన ఈ సినిమా, చాలా సంవత్సరాల తరువాత స్కూల్ రెయూనియన్ వేడుకలో కలుసుకున్న ప్రేమ జంట. రామ్ & జాను ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం, ప్రేమ ఉన్నా ఎప్పుడూ చెప్పుకోకపోవడంతో కలవలేకపోతారు. ఫ్లాష్ బ్యాక్ స్కూల్ ఎపిసోడ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. అందరిని ఆకట్టుకుంటుంది. చిన్ననాటి రామ్, జానూ పాత్రలు చూడ చక్కగా ఉంటాయి. అయితే రెయూనియన్ తరువాత పెళ్లి చేసుకుని సింగపూర్ లో సెటిల్ అయి ఏకాంతంగా గడపాలని భావిస్తారు.. ఆ చిన్నపాటి ప్రయాణంలో జరిగే మధుర క్షణాలు, తరువాత ఏమి జరుగుతుంది అనేది మీరు వెండితెరపై చూడాల్సిందే. తమిళంలో “96” చిత్రాన్ని చూడకుండా “జాను” చిత్రాన్ని చుసిన వారికీ మాత్రం ఈ సినిమా మంచి ఫ్రెష్ అనుభూతినిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ముందుగా టైటిల్ పాత్ర పోషిస్తున్న మన “జాను” సమంత గురించి చెప్పుకోవాలి. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ సమంతకి కొత్తేమీకాదు కానీ ఈ చిత్రంలో ఆమె నటనతో ఆమె కెరీర్లో మరో అద్భుతమైన పాత్ర పోషించింది. హీరో శర్వానంద్ తో కెమిస్ట్రీని అద్భుతంగా పండించింది. ఆమె తప్ప వేరే ఎవరిని “జాను” క్యారెక్టర్ లో ఊహించుకోలేనటగా ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను మరిపించింది. మొత్తానికి ఈ సినిమాకు మంచి మార్కులు కొట్టేసింది సమంత.

ఇక శర్వానంద్. మనస్సులోని బాధలు బయటకి అస్సలు బయటపెట్టకుండా క్రమశిక్షణ తో మెలిగే “రామ్” క్యారెక్టర్ లో శర్వానంద్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడనే చెప్పాలి. లవ్ ఫెయిల్యూర్ అయినా ప్రతి వ్యక్తి రామ్ పాత్రలో తమను తాము ఊహించుకుంటారు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడు తన నటనతో.. అయన నటనతో పాటుగా అయన వాయిస్ ఈ సినిమాకి మరో అదనపు బలం. శర్వానంద్ కెరీర్ బెస్ట్ సినిమాగా “జానూ” నిలుస్తుంది.

ఇతర పాత్రలలో “వెన్నెల కిషోర్”, శరణ్య (ఫిదా ఫెమ్), రఘుబాబు తదితరులు వారి పాత్రలకు తగ్గట్టుగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిన్ననాటి స్కూల్ పాత్రలకు రామ్, జానూ పత్రాలు పోషించిన సాయి కిరణ్, గౌరీ కిషన్ అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరిని తన దృశ్యకావ్యానికి కనెక్ట్ అయ్యేలా స్వచ్ఛమైన హావభావాలు రాబట్టుకోవడంలో దర్శకుడు “ప్రేమ్ కుమార్” సఫలం అయ్యారనే చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ లోని చిన్నప్పటి రామ్, జానూ క్యారెక్టలను సెలెక్ట్ చేయడంలోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. ప్రేక్షకులు మళ్ళి మళ్ళి వచ్చి చూడటానికి ప్రేరేపించేలా అయన ఈ సినిమాని అద్భుతంగా “జాను”ను తెరకేకించారు. తమిళంలో చేసిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ చేయడం కోసం దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. సంగీత దర్శకుడు గోవిందా వసంత కూడా తన సంగీతంతో ప్రేక్షకులను మైమరపించారు. మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరో అసెట్.

ఇక ఫైనల్ గా కథలో కథనంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా “96” చిత్రాన్ని అలాగే దింపేసాడు దర్శకుడు. సో 96 చిత్రాన్ని చూడని వారు ఈ చిత్రానికి బాగానే కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కాస్త స్లో గా అనిపిస్తుంది. కానీ శర్వానంద్, సమంతల కెమిస్ట్రీ కోసం, సమంత, శర్వానంద్ ల నటన కోసం ఈ సినిమా కచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందే.

ఇంకా ఏంటి అండి… రేటింగ్ కోసం చూస్తున్నారా ? సినిమా బాగుంది రేటింగ్ తో పనేముంది చూసేయండి ఒక పనైపోతుంది.