అక్కినేని వారి కోడలు, నాగ చైతన్య భార్య, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత బుల్లితెర మీద అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. మామ నాగార్జున బాటలో నడిచేందుకు రెడీ అవుతుంది ఈ “బేబీ”… “జాను” డిజాస్టర్ తరువాత సమంత తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. విజయ్ సేతుపతి, నయనతార నటిస్తున్న సినిమాలో జాను కీలక పాత్ర చేస్తుంది. హీరో ప్రసన్న సరసన మరో సినిమాకూడా సైన్ చేసిందట. అంతేకాదు ఫామిలీ మ్యాన్ 2 లో కూడా నటిస్తుంది.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదే మామయ్య నాగార్జున బాటలో నడిచేందుకు సమంత సిద్ధమవుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆమె బుల్లితెర షో చేయడం కోసం రంగం సిద్ధం చేసుకుంటుందట. ఒక ప్రముఖ ఎంటెర్టైమెంట్ ఛానెల్ లో సమంత హోస్ట్ గా ఓ టాక్/గేమ్ షో మొదలుపెట్టే పనిలో పడిందట. టాలీవుడ్ లోని సెలెబ్రెటీలు అందరు పాల్గొనే విధంగా ఈ షోను డిజైన్ చేశారట.

అంతేకాదు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఈ గేమ్ షోకి గెస్టులుగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ప్రారంభం కాబోయే ఈ షో కోసం తెగ కష్టపడుతుందట సామ్. దీనికోసం మామ నాగార్జున సలహాలు తీసుకుంటుందట.

నాగార్జున ఆల్రెడీ “బిగ్ బాస్”, “మీలో ఎవరు కోటీశ్వరుడు” వంటి రియాలిటీ షోలలో తన టాలెంట్ నిరూపించుకుని యాక్టింగ్ మాత్రమే కాదు యాంకర్ గా కూడా నాగార్జున టాప్ అనిపించుకున్నారు. అదే కోవలో కోడలు సమంత కూడా నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. వెండితెర మీద టాప్ హీరోయిన్ మాయ చేసిన అక్కినేని వారి కోడలు, బుల్లితెర మీద ఈ మాయ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here