టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కినేని ఇంటికి కోడలైన సమంత అచ్చం తన అత్త బాటలోనే నడుస్తోంది. అమలకు మూగజీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా సమంత కూడా తనకెంతో ఇష్టమైన పెట్ హష్ గురించి తన అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత తన పెట్ ను తన బిడ్డగా భావించి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.

తన హష్ కోసం సమంత కొన్నిసార్లు చైతన్యతో గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.హష్ ను ఎవరు ప్రేమగా చూసుకుంటారు?హష్ కి ఎవరంటే ఇష్టం అనే విషయాలలో తరచు వీరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ విధంగా వీరిద్దరూ తమ హష్ పై ఎంతో ప్రేమను చూపిస్తారు.
తాజాగా హైదరాబాద్ నగరం వర్షంతో తడిసి ముద్దయింది. ఈ క్రమంలోనే వాతావరణం ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉండటంతో సమంత తన హష్ తో కలిసి గార్డెన్లో ఎంతో సరదాగా ఆడుకున్నారు.ఈ విధంగా వీరిద్దరూ ఆడుకున్న టువంటి వీడియోను సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/reel/CRTjNjVgwim/?utm_source=ig_web_copy_link
ఈ వీడియోలో సమంత, తన హష్ బెలూన్ ఆట ఆడారు.ఆ బెలూన్‌ను సమంత పైకి ఎగిరేస్తుంటే.. హష్ సైతం పైకి ఎగిరి ఎగిరి తంతోంది.. అలా ఇద్దరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లు ఆకట్టుకుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు సమంత ట్రైనింగా ..మజాకా సమంత ట్రైనింగ్ ఇస్తే ఈ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
































