తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ఆ తర్వాత తమిళం ఇండస్ట్రీలోను అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లి తెర పై, పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు. తాజాగా సమంత “ది ఫ్యామిలీ మెన్ 2″అని వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సిరీస్ లో సమంత ఉగ్రవాది రాజీ అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించడంతో ఆమె నటన పై పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇందులో ఎల్‌టీటీఈ కి సహకరించే తమిళ ఉగ్రవాదిగా కనిపించడంతో ఈమెపై తమిళులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. గత కొన్ని రోజుల క్రితం హిందీలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ తాజాగా తెలుగు తమిళ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తనకి ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశంలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అయితే ఎవరి మనోభావాలను కించ పరచాలని తాను అనుకోవడం లేదని, ఒకవేళ ఈ సిరీస్ చూసినప్పటికీ వారికి అలాంటి అభిప్రాయామే ఉంటే అందుకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే తాను ఏమి ఉద్దేశపూర్వకంగా చేయలేదని ఈ సందర్భంగా సమంతా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈ సిరీస్ లో రాజీ పాత్ర గురించి చెబుతూ.. తను ఒక ఉగ్రవాది కాదని,నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన ఒక అమ్మాయి అని తెలియజేశారు.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం సమంత సోషల్ మీడియా అకౌంట్లో “అక్కినేని” అనే పేరును తొలగించడంతో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వాటి పై స్పందించిన సమంత అవన్నీ కేవలం వదంతులు మాత్రమే.. ఇలాంటి వాటిపై తానెప్పుడూ స్పందించలేదని ఇప్పుడు కూడా స్పందించడం లేదని తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఒక నెల రోజుల పాటుబ్రేక్ తీసుకుంటున్నానని అప్పటి వరకు ఎలాంటి కొత్త సినిమా కథలను కూడా వినదలచుకోలేదని ఈ సందర్భంగా తెలియజేశారు.
































