టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్న సమంత నాగ చైతన్య వ్యక్తిగత కారణాల వల్ల వారి వైవాహిక జీవితం గురించి కీలకమైన నిర్ణయం తీసుకుని వారి వివాహ బంధం నుంచి విడిపోయారు.ఈ క్రమంలోనే నాగచైతన్య సమంత దంపతులు అక్టోబర్ 2వ తేదీ వీరి విడాకుల విషయాన్ని అధికారికంగా తెలియజేయడం జరిగింది. అయితే విడాకుల తర్వాత సమంత ఏ విధమైనటువంటి పోస్టులు చేయకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే సమంత విడాకులు తీసుకున్న అనంతరం మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తన పేరు మార్చుకున్న సమంత తాజాగా మరొక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సందర్భంగా సమంత తెలియజేస్తూ… ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకున్నప్పుడు ముందుగా నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. మధ్యాహ్నం వరకు పడుకొని మనం చేయాలనుకుంటున్నా పనుల గురించి కలలు కనకూడదు.. బద్ధకం వదిలి ముందుకు నడవాలి తనని తానే రక్షించుకోవాలి అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో ఇకపై తన బాధ్యతలను చూసుకోవాలని ఒంటరిగా జీవితంతో పోరాడటానికి ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
































