Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా సమంత సెల్ఫీ దిగిన ఫోటోని షేర్ చేస్తూ
ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఇయర్ అని కామెంట్ పెట్టారు. ఈ ఏడాది అంతా శుభమే అని సమంత విశ్వాసం ప్రకటిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. గత రెండు సంవత్సరాలుగా సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం అనంతరం మయోసైటిసిస్ వ్యాధి బారిన పడటం వల్ల సమంత గత రెండు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఆమె ఈ ఏడాది అయినా తనకు అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

Samantha: మంచే జరగాలి…
ఇలా సమంత ఈ పోస్ట్ చేయడంతో అభిమానుల సైతం తనకు ఈ ఏడాది మంచిగా జరగాలని కోరుకుంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే తాజాగా ఈమె శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు.































