Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్న సమంత గతేడాది అక్టోబర్ లో తన భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఆ బాధ నుంచి బయట పడటం కోసం తన మనసులో ఉన్న భావాలను సోషల్ మీడియా వేదికగా పోస్టుల రూపంలో వెల్లడించారు.

విడాకుల విషయం నుంచి బయట పడిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.ఇక తన వ్యక్తిగత విషయాల గురించి సమంత వివిధ రకాల పోస్టుల రూపంలో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఈ క్రమంలోనే సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా మరోసారి తన విడాకుల విషయమై పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ మీరు జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ అవి మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ఇక ఈ ఏడాది తన జీవితానికి సంబంధించి ఎలాంటి హోప్స్ లేవనీ సమంత చెప్పుకొచ్చారు.
తన జీవితంలో ఎలాంటి అంచనాలు లేవు…
గత ఏడాది తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా ఈ ఏడాది తనకు తన జీవితం గురించి ఎలాంటి అంచనాలు లేవని తన జీవితంలో ఏదైతే స్థిరంగా ఉంటుందో దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నేను నా జీవితానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలను తయారు చేసుకున్నానని అయితే ఆ ప్రణాళికలన్ని శిథిలమై పోయాయని అందుకే ఈ ఏడాది ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదని తెలియజేశారు. ఇలా సమంత చేసిన ఈ పోస్ట్ విడాకుల గురించి పరోక్షంగా చేసింది అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.































