Samantha: నా జీవితంలో అవి చీకటి రోజులు… విడాకుల ఘటనపై స్పందించిన సమంత!

0
186

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈమె మయూసైటిస్ వ్యాధి బారిన పడటంతో సినిమా షూటింగులకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం కోలుకోవడంతో తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

ఇలా ఒకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూ మరోవైపు శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు విషయాలను తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా ఈమె నాగచైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలియజేశారు. ఇక విడాకులు అనంతరం తప్పు మొత్తం సమంతది అంటూ పెద్ద ఎత్తున తనపై ట్రోల్స్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ట్రోల్స్ గురించి సమంత స్పందిస్తూ…

Samantha: ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నా…..

అవి నా జీవితంలో చీకటి రోజులు పిచ్చిపిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని కోరుకున్నాను. ఆ సమయంలో నా మనసుకు నచ్చిన విధంగా రియాక్ట్ అయ్యాను. ధైర్యంతో ముందడుగు వేశాను. ఆ సమయంలో నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో అండగా నిలిచారు. ఇక ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నాను అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంత మేలు అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.