Samantha -Mrunal:టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులతోనూ అలాగే ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. ఇలా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నటువంటి సమంతకు మరొక నటి మృణాల్ సమంతను ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.
శాకుంతలం సినిమా చూడటానికి నేను ఇంకా ఎదురు చూడలేకపోతున్నాను. మీరు చాలా స్ఫూర్తిదాయకం సామ్. మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ.. గుమ్రా చిత్రానికి గాను మీకు శుభాకాంక్షలు. నాకు ఈ ఐడియా వచ్చింది మృణాల్. ఇద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం అంటూ రిప్లై ఇచ్చారు.

Samantha -Mrunal: శాకుంతలం కోసం ఆగలేకపోతున్నా…
ప్రస్తుత కాలంలో ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే సమంత మృణాల్ వంటి ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ ఒక సినిమాలో నటిస్తే అభిమానులకు పండగే అని చెప్పాలి. మరి నిజంగానే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అనేది ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇక మృణాల్ ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న సినిమాలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
Congratulations on #Gumraah beautiful @mrunal0801 ????
Let’s do it.. ???????? love the idea!! https://t.co/rqQqSbXWER— Samantha (@Samanthaprabhu2) April 9, 2023
































