Samantha: సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో అన్ని భాషలలోనూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ఈ సినిమా 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు కాలంలో తన జీవితంలో ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నానని ఎన్నో ఆటుపోట్లకు గురయ్యానని తెలిపారు. అయితే తన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. నా కెరియర్ లో ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలు అందరికీ తెలుసు.

Samantha: నాగచైతన్య ఉద్దేశించి చేశారా..
ఇక తాను కొంతమంది లాగా ఏ విషయాలను దాచిపెట్టలేదు నాకు జీవితంలో ఫేక్ గా ఉండటం ఏమాత్రం నచ్చదు అంటూ కామెంట్స్ చేశారు.ఇలా నేను కొందరి లాగా విషయాలను దాచిపెట్టలేదు అంటూ సమంత చేసిన ఈ కామెంట్స్ నాగచైతన్యను ఉద్దేశించి చేశారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా సమంత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.































