Samantha new film Yashodha releases in August : సమంత నటిస్తున్న పాన్ ఇండియా సినిమా యశోద విడుదలకు సిద్దమైంది.శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత ఒక గర్భవతి గా కనిపించనుందట.యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ‘యశోద’ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2022 ఆగస్టు 12న తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన పోస్టర్ ను కూడా వదిలారు.

లాల్ సింగ్ చద్దా , ఏజెంట్ తో పోటీపడనున్న యశోద…..
ఆగష్టు రెండో వారం లో వరుస సినిమా జోరు కనిపిస్తోంది.ఆగష్టు 11 న నాగచైతన్య నటించిన అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా విడుదలవుతోంది. ఇక ఆగష్టు 12 న అఖిల్ నటించినా ఏజెంట్ సినిమా విడుదలవుతోంది. ఇక వీటి మధ్యలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ కూడా విడుదల చేయాలని చిత్రం బృందం ఆలోచిస్తున్నారు. ఇక అదే రోజున సమంత యశోద విడుదల తేదిని ప్రకటించడం తో ఆగష్టు రెండోవారం వరుస సినిమాలు సందడి చేసేలా ఉన్నాయి.
అయితే ఇందులో ఏవి వెనక్కు తగ్గుతాయో, ఏవి బాక్స్ ఆఫీస్ లో పోటీ పడనున్నాయో తెలియదు.ఇక బాక్స్ ఆఫీస్ ముందు సత్తా చాటేది ఎవరో తెలియాలంటే ఆగష్టు వరకు ఆగల్సిందే. ఎక్కడ మరో విశేషం నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా అఖిల్ ఏజెంట్, సమంత యశోద మూడు సినిమా లో పాన్ ఇండియా సినిమాలు కావడం.దక్షిణాదిన అన్ని భాషలతో కలుపుకుని హిందీ లో కూడా విడుదల అవుతున్నాయి.
































