Samantha: సినీనటి సమంత ఇన్ని రోజులు తన వ్యక్తిగత విషయాల కారణంగా సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యపరంగా కుదటపడటంతో తిరిగి సినిమా పనులలో బిజీ అవుతున్నారు. ఇక గతంలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి ఈమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సిరీస్ సిటాడెల్ పేరుతో వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం ఇది హనీ బన్నీ పేరుతో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సమంత మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు చూపించడం కోసం గత సంవత్సరం పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.. వరుణ్ దావన్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన వర్క్ విషయంలో చాలా అంకితభావంతో పనిచేస్తారని సమంత వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
లేచి నిలబడతా..
మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు వచ్చాయి అయితే ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ… కొన్నిసార్లు నేను చేతులు ఎత్తేసానని అయితే కథ అక్కడితో ముగిసిపోయినట్టు కాదని తెలిపారు. నేను కింద పడిన తిరిగి లేస్తానని ఇలా ఎంతో ధైర్యంతోనే తనక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డానని ఈ సందర్భంగా సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

































