Samantha-Nagachaitanya: నాగచైతన్య, సమంత టాలీవుడ్ లో చూడచక్కనైన జంట. అలాంటి జంట ఇటీవల వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఇలా విడిపోవడాన్ని అందమైన జంట అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ కలిస్తే బాగుండు అని ఆకాంక్షిస్తున్నారు.

ఈ విడాకులకు సంబంధించి ఏ అంశాన్నైనా అభిమానులు ఆసక్తిగా గమనిస్తుంటారు. ఈ మధ్య వారు కలిసినప్పటి విషయాలను సమంత అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతోనే పంచుకుంటుంది. దీనికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.

ఈ వీడియోలో సమంత తన మాజీ భర్త నాగచైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ నాగచైతన్య మంచి భర్త అని చెప్పింది. తనకు ఏ కష్టం వచ్చినా తోడుండే వాడని చెప్పింది. ఒకసారి తాను అమ్మతో ఫోన్ మాట్లాడాల్సి వచ్చినప్పడు తన దగ్గర డబ్బులు లేకపోతే తన ఫోన్ ఇచ్చాడని పొగడ్తలతో ముంచెత్తింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తో..
ఇదిలా ఉండగా.. విడాకుల తర్వాత సమంత తన సినిమాల జోరు పెంచింది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో‘ఊ అంటావా మావా’ అనే ఐటెం సాంగ్ చేసింది. ఈ పాట సమంతకు మంచి క్రేజ్ తెచ్చింది. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తో ఓ భారీ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపింది. త్వరలోనే ఆ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ వెబ్ సిరీస్ కు ఫ్యామిలీ మేన్-2 దర్శకులు దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది.



























