Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తో పాటు, కెరీర్ పరంగా కూడా దూసుకుపోతోంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి, అదే విధంగా తన పెట్స్ గురించి తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఆమె టూర్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో సమంతా షేర్ చేసిన ఫోటోలపై, వీడియో లపై, పోస్టులపై కొంతమంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే సమంతా వాటిని చూసి చూడనట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి తనపై మితిమీరి ట్రోలింగ్ చేసేవారికి ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది. తాజాగా సమంత సమంత అలాగే చేసింది. ఏం జరిగిందంటే.. తాజాగా సమంత కూడా ఈ ట్రోలింగ్ బారిన పడింది. క్రిటిక్స్ చాయిస్ ఫిలిం అవార్డుల ఫంక్షన్‌కు గ్రీన్ గౌన్‌లో హాజరయ్యింది. అక్కడ సమంతలుక్ చాలామందికి నచ్చలేదు.

దీంతో ఆమె డ్రెస్సింగ్ స్టయిల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగతంగానూ ఆమెను హర్ట్ చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో హర్ట్ అయిన సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రోలింగ్స్ చేసేవారికి ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్ ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ ఇప్పటికి అదే వివక్షను చూపుతుంటారు. మహిళలు వేసుకునే బట్టల ఆధారంగా చాలా ఈజీగా వారిని జడ్జ్ చేస్తుంటారు.
ఇప్పటికైనా జడ్జ్ చేయడం ఆపరా?
మనం ప్రస్తుతం 2022వ సంవత్సరంలో ఉన్నాము. ఇప్పటికైనా మహిళలను జడ్జ్ చేయడం ఆపరా? వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? ఎలా కనిపిస్తున్నారనేదాన్ని బట్టే స్త్రీలను అంచనా వేయడం మానేసి మనపై మనం దృష్టి సారించగలమా? మీ అభిప్రాయాలను రుద్దడం వల్ల ఎవరికీ మేలు జరగదు అంటూ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది సమంత. ఇక ప్రస్తుతం సమంత వరస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది.



























