అక్కినేని సమంత ఓ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమంత టాక్ షో”సామ్ జామ్”ప్రోమో వీడియో బయటకు వచ్చింది. ఈ టాక్ షో ద్వారా పలు సెలబ్రిటీస్ ల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడమే ఈ టాక్ షో ప్రత్యేకత. అయితే ఈ టాక్ షోలో ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చారు. విడుదలైన ప్రోమో ప్రకారం ప్రస్తుతం విజయ్ దేవరకొండ సింగిలేనని ఆడియన్స్ కి చెబుతాడు.

ఈ షో కోసం సమంత ఇప్పటికే సిని సెలబ్రెటీలతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఈరోజు ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇంటర్నెట్లో విడుదలైనప్పటి నుంచి ఈ టాక్ షో కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రోమో వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
ఈ టాక్ షో ప్రోమో ప్రకారం చిరంజీవి,అల్లు అర్జున్, తమన్నా,రష్మిక వంటి సినీస్టార్ల తోపాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్,కశ్యప్ మొదలైన వారు కూడా ఈ టాక్ షోలో గెస్ట్ గా కనిపించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఫస్ట్ ఎపిసోడ్ ను శుక్రవారం స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండకు సమంత ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో,వాటికి విజయ్ దేవరకొండ ఎలాంటి సమాధానాలు చెబుతారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దసరా స్పెషల్ ఎపిసోడ్ గా బిగ్ బాస్ సీజన్ 4 ఎపిసోడ్ కి సమంత హోస్ట్ గా నిర్వహించారు. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ నిమిత్తం నాగార్జున షూటింగ్ కి వెళ్లగా అతని స్థానంలో సమంత హోస్ట్ గా నిర్వహించిన విషయం తెలిసినదే. ఈ రోజు విడుదల కానున్న సమంత టాక్ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.































