Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత ప్రస్తుతం తన ఆరోగ్యం పై దృష్టి పెడుతూ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు. గతంలో ఈమె మయోసైటీస్ వ్యాధి బారిన పడ్డారు. ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే అప్పటికే తాను కమిట్ అయిన సినిమాలు షూటింగ్ పనులు వాయిదా పడటంతో తిరిగి సినిమా షూటింగ్ పనులలో పాల్గొని వాటిని పూర్తి చేశారు.

ఈ విధంగా సమంత తన సినిమా షూటింగ్ పనులు పూర్తిచేసుకుని ఇతర సినిమాలకు కమిట్ అవ్వకుండా ఏడాది పాటు విరామం ప్రకటించారు. అయితే త్వరలోనే ఈమె ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లబోతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా పలు ప్రాంతాలకు వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సమంత అమెరికా వెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ కోసం భారీగానే ఖర్చు అవుతుందని తెలుస్తుంది.
ఏడాది పూర్తిగా విరామం తీసుకుని ఈ వ్యాధి నుంచి తాను పూర్తిగా బయటపడాలన్న ఉద్దేశంలో సమంత ఉన్నారు. అయితే ఈ ట్రీట్మెంట్ కోసం అవసరమయ్యే డబ్బు తన వద్ద లేకపోవడంతో ఇండస్ట్రీలో తనకు ప్రాణ స్నేహితుడు అయినటువంటి స్టార్ హీరో వద్ద ఏకంగా ఈమె 25 కోట్ల రూపాయలు అప్పు చేశారని సమాచారం.ఇలా సమంత ట్రీట్మెంట్ కోసం అప్పు చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Samantha: ట్రీట్మెంట్ కి కూడా డబ్బులు లేవా…
దాదాపు దశాబ్దన్నర కాలంగా ఇండస్ట్రీలో సమంత స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఇన్ని రోజులు ఈమె సంపాదించిన డబ్బు అంత ఏమైంది సమంత ట్రీట్మెంట్ కోసం చివరికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందనీ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే అక్కినేని ఫ్యామిలీతో కలిసి ఉండి ఉంటే నీకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా సమంత అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.