Samantha: పిల్లలతో ఆటలాడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్న సమంత… వైరల్ అవుతున్న వీడియోలు?

0
44

Samantha: సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంతా ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడపడానికి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా తన వెకేషన్ లకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇలా బాలీ వెకేషన్ పూర్తి చేసుకున్న ఈమె తిరిగి చెన్నై చేరుకున్నారు.

ఇలా సమంత చెన్నై తిరిగి రాగానే ఈమె తన ప్రాణ స్నేహితురాలు సింగర్ చిన్మయి ఇంటికి వెళ్లారు. సమంత చిన్మయి ఎంత ప్రాణ స్నేహితులో మనకు తెలిసిందే.ఇలా చిన్మయి ఇంటికి వెళ్లినటువంటి సమంత అక్కడ తన పిల్లలతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు ఇలా చిన్మయి పిల్లలతో సమంత ఆడుకుంటూ వారితో కలిసి డ్యాన్సులు చేస్తూ ఉన్నటువంటి వీడియోలను ఈమె ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఈ విధంగా సమంత కూతురిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తనతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించారు. అనంతరం తన ఇద్దరి కూతురులతో పోటీపడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.ఇలా చాలా రోజుల తర్వాత సమంత పిల్లలతో కలిసి ఇలా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ కనిపించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha: చిన్మయి పిల్లలతో సమంత…


మయూసైటిసిస్ కారణంగా సినిమాలకు విరామం ప్రకటించినటువంటి ఈమె త్వరలోనే ట్రీట్మెంట్ కూడా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈలోపు ఈమె తనకెంతో ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళుతూ తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.