Samantha: ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న సమంత..? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సామ్ !

0
913

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం పాటు కొనసాగాలంటే టాలెంట్ తో పాటు అందం కూడా ఎంతో ముఖ్యం. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనుగడ సాగించడానికి తమ అందాన్ని కాపాడుకోవడానికి ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి సమంత సైతం తాజాగా సర్జరీ చేయించుకుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని అందుకే ఆమె సర్జరీ కోసం అమెరికా వెళుతుంది అంటే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని తన మేనేజర్ కొట్టి పారేశారు.

ఇలా చాలా కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి సమంతా తాజాగా డాగ్స్ ఫుడ్ సంస్థకు సంబంధించిన యాడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ యాడ్ లో నటించిన సమంతను చూసి ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. అసలు సమంత ఏంటి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా సమంత రూపురేఖలు మారిపోవడంతో ఎంతోమంది ఈమె సర్జరీ చేయించుకుందని భావిస్తున్నారు.

Samantha: పెదాలకు సర్జరీ..


ఇలా గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి సమంతా అమెరికాలో తన పెదాలకు సర్జరీ చేయించుకుందని. దీంతో తన ముఖ కవళికలు మొత్తం మారిపోయాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇలా సర్జరీ చేయించుకోవడం వల్ల సమంత చూడటానికి చాలా చండాలంగా కనిపిస్తున్నారంటూ అభిమానులు సైతం ఆమె విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే సమంత సర్జరీ చేయించుకున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.