Samantha: స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం గురించి అందరికీ తెలిసిందే. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత ఆ తర్వాత డిప్రెషన్ నుండి బయటపడటానికి వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యింది. అయితే ఆ సమయంలో ఆమె మయోసైటీసిస్ వ్యాధి బారిన పడింది. దీంతో దాదాపు నాలుగు నెలల పాటు ఆమె మీడియా ముందు, సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కనిపించలేదు.

ఆ తర్వాత తాను మయోసైటీసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా ఆమె చికిత్స పొందుతున్నట్లు కూడా తెలిపింది.అనారోగ్యం వల్ల సమంత యశోద సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేకపోయింది. ఇక ఇటీవల సమంత ఆరోగ్యం కొంతవరకు కుదుటపడటంతో తాజాగా విడుదలైన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది. అయితే అప్పటికి ఆమె ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపింది.
ఈ క్రమంలో తాజాగా సమంత షేర్ చేసిన ఒక ఫోటో అభిమానుల్లో ఆందోళన రేపింది. ఆక్సిజన్ మాస్క్ తో ఉన్న సమంత ఫోటో చూసిన ఆమె అభిమానులు మళ్లీ ఏమైందంటూ? ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ తర్వాత ఆమె షేర్ చేసిన మరొక ఫోటో చూసి సమంత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైపర్బేరిక్ థెరపీ కోసం సమంతాల ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నట్లు క్లారిటీ వచ్చింది.

Samantha:హైపర్బేరిక్ థెరఫీ…
హైపర్బేరిక్ థెరఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి సమంత తెలుపుతూ.. కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. పాడైన కండరాలను బాగుచేస్తుందని వెల్లడించింది. సమంతకి మయోసైటిస్ సోకిన నేపథ్యంలో ఆమె ఈ హైపర్బేరిక్ థెరఫీ తీసుకుంటున్నట్లు అర్థం అవుతుంది. మయోసైటిస్ నుండి సమంత పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీటాడెల్ ప్రమోషన్ పనులలో సమంత బిజీగా ఉంది. అంతే కాకుండా మరొకవైపు ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.



























