Samantha: సినీనటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈయన మరణించడంతో సమంత మళ్ళీ నిన్ను కలుసుకునే వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా సమంత సోషల్ మీడియా వేదికగా తన తండ్రి మరణ వార్తను తెలియజేయడంతో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా సమంత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు సామ్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతినిండా ఎన్నో సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న సమంతకు తన తండ్రి మరణం తీరని లోటు అని చెప్పాలి.
ఇలా సమంత తండ్రి మరణించడంతో అభిమానులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సమంత ఇప్పుడిప్పుడే అన్నింటిని తట్టుకొని ఎంతో ధైర్యంగా నిలబడి ముందుకు వెళుతున్న సమయంలో తన తండ్రి మరణం ఆమెకు ఎంతో తీరని లోటని భావిస్తున్నారు.

Samantha:
ఒకవైపు తన మాజీ భర్త పెళ్లి జరుగుతుండగా మరోవైపు సమంత తండ్రి మరణం వార్త తనని ఎంతగానో కృంగతీస్తోందని చెప్పాలి. సమంత మాజీ భర్త నాగచైతన్య ప్రస్తుతం పెళ్లి చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతుండగా సమంత మాత్రం ఒకవైపు తన మాజీ భర్త పెళ్లిని మరోవైపు తన తండ్రి మరణాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావడంతో పూర్తిగా విషాదంలో మునిగిపోయిందని చెప్పాలి.































