Samantha: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగ వెలుగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఈ విధంగా దక్షిణాది సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలతో కూడా సమంత బిజీ కానున్నారు. ఇకపోతే సమంత నటించిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కరణ్ జోహార్ నిర్వహిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు.ఈ టాక్స్ షోలో భాగంగా సమంత తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోల గురించి కూడా ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోల సరసన నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల పేర్లు చెబితే వారికి ఎలాంటి ట్యాగ్ ఇస్తావు చెప్పమని కరణ్ ఈమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అని కరణ్ జోహార్ ప్రశ్నించగా వెంటనే సమంత ఓజీ అనే టాగ్ ఇచ్చింది. అలాగే అల్లు అర్జున్ అంటే మ్యాజిక్ అని సమాధానం చెప్పేస్తుంది.
ఒరిజినల్ గ్యాంగ్ స్టర్….
సమంత రామ్ చరణ్ కి ఇచ్చిన ట్యాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసలు సమంత రామ్ చరణ్ కి ఇచ్చిన ఆ ట్యాగ్ అర్థం ఏమిటి? అసలు ఓజీ అంటే అర్థమేంటి అని పెద్ద ఎత్తున నెటిజన్ లు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని తెలియడంతో సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.
































