Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా మంచి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో హీరో నాగచైతన్య ని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే వివాహాం జరిగిన కొంత కాలానికే ఇద్దరిమధ్య మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకొని దూరమయ్యారు.

ఇక విడాకుల తర్వాత వీరిద్దరూ ఎవరికివారు తమ పనులు బిజీగా మారిపోయారు. అయితే ఇప్పటికీ వీరి విడాకులకు గల అసలు కారణం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత నాగచైతన్యతో విడిపోవడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా తొందర్లోనే విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రమోషన్ పనులలో భాగంగా సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది.

ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి అనేక విషయాలను వెల్లడించిన సమంత అలాగే నాగచైతన్యకు దూరం కావటానికి గల కారణాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విడాకుల గురించి సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ..’ నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే తనతో ఉన్న వారే ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయమని చెప్పారు అంటూ తెలిపింది. విడాకులు తీసుకున్న వారు ఇలా ఐటం సాంగ్స్ లో నటించటం మంచిది కాదని వారు చెప్పారు.
Samantha: వర్కౌట్ కాలేదు..
నాకు మాత్రం విడాకులు తీసుకున్న వారు ఏం తప్పు చేయకపోయినా కూడా అన్ని వదులుకొని బాధ పడుతూ ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదని అనిపించింది. అంతే కాకుండా వైవాహిక జీవితంలో ఒక భార్యగా తాను 100 శాతం నిజాయితీగా ఉన్నానని, అయినప్పటికీ నాకు ఆ బంధం వర్కౌట్ అవలేదని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా నేరం చేసిన దానిలా దాక్కొని నన్ను నేను హింసించుకోవలసిన అవసరం ఏముందని సమంత ప్రశ్నించింది. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవటంతో నాగచైతన్య దే తప్పు ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.































