Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడు సంవత్సరాల పాటు వీరిద్దరి తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన ఇప్పటికి వీరి విడాకుల గురించి ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది అయితే ఇటీవల సమంత ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఓ హెల్త్ పాడ్ కాస్ట్ లో భాగంగా ఈమె తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నారు అనే విషయాలను వెల్లడించారు అయితే ఈ వీడియో పట్ల ఒక నెటిజెన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేసావో చెప్పు అంటూ సమంతను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమంత రిప్లై ఇస్తూ.. సారీ ఇలాంటివి చేయడం మీకు అంత మంచిది కాకపోవచ్చు మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. మీకు అంత మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ ఈమె చేతులెత్తి దండం పెడుతున్నటువంటి ఎమోజిని షేర్ చేశారు.
మీకు మంచే జరగాలి..
ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి నేటిజన్ కామెంట్ చేయడంతో సమంత స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వడంతో సమంత అభిమానులు ఆమెకు సపోర్ట్ చేస్తూ ఎవరైతే మిమ్మల్ని ఇంకా కింద దిగజార్చాలని చూస్తారో అలాంటి వారికి ఇలాగే సమాధానం చెప్పాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినటువంటి సమంత త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.



























