Samantha: నిర్మాతలు నన్ను అర్థం చేసుకొని ఓపికగా ఎదురు చూశారు… ఆరోగ్యంతోనే తిరిగి వస్తా: సమంత

0
44

Samantha: సమంత ప్రస్తుతం ఏడాది పాట సినిమాలకు విరామం ప్రకటించి తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. అయితే ఈమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సమంత పాల్గొని సందడి చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా ఈ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సమంత పాల్గొని సందడి చేయడమే కాకుండా అనంతరం మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు.తాను మయోసైటిసిస్ కి గురైన తర్వాత సినిమా షూటింగ్ కు దూరమయ్యాను అయితే నాకోసం నిర్మాతలు ఎంతో కాలం పాటు చాలా ఓపికగా ఎదురు చూశారు అందుకు వారికి నేను రుణపడి ఉంటాను అని తెలిపారు.

Samantha: మీకోసం హార్డ్ వర్క్ చేస్తున్న…


ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట తనకు ఎంతో అద్భుతంగా నచ్చాయని తాను కూడా మీ అందరితో పాటు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా చూడటం కోసం ఎదురుచూస్తున్నానని సమంత తెలియజేశారు. అభిమానులను ఉద్దేశిస్తూ ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాలకు తాను దూరంగా ఉన్నానని తొందరలోనే మీ ముందుకు రావడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తాను అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.