Samantha: టాలీవుడ్ క్రేజీ కపుల్స్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కూడా వీరి గురించి ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు.

తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్లలో నాగచైతన్య తన విడాకులకు గల కారణాలను తెలిపారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే మా ఇద్దరి మధ్య గొడవలు పెద్దవయ్యా అని అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు. నిజానికి సమంత చాలా మంచి అమ్మాయి ఇప్పటికీ తన జ్ఞాపకాలను నేను గౌరవిస్తానని, అన్ని ఆనందాలకు సమంత అర్హురాలు అంటు నాగ చైతన్య తన గురించి గొప్పగా చెప్పారు.
ఇలా నాగచైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి అయితే తాజాగా సమంత సైతం సోషల్ మీడియా వేదికగా ఒక కొటేషన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ కొటేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ పోస్ట్ షేర్ చేస్తూ… మనమంతా ఒక్కటే కేవలం అహంకారం భయాలు అవే మనల్ని దూరం చేస్తాయి అంటూ పోస్ట్ చేశారు.

Samantha: ఈగో వీరిద్దరిని దూరం చేసిందా…
ఇలా సమంత నాగచైతన్య చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలాంటి కొటేషన్స్ షేర్ చేయడంతో నాగచైతన్య వ్యాఖ్యలకు స్పందిస్తూ సమంత ఈ కొటేషన్ షేర్ చేశారని అర్థమవుతుంది.అయితే వీరిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని కానీ ఈగో కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనీ వీరి పోస్టులు చూస్తేనే అర్థమవుతుంది.

































