Samantha Vs Sai Pallavi : దక్షిణాది సినీ ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని అనంతరం ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు నటి సమంత. కెరియర్ మొదట్లో ఈమె కూడా పలు చేదు అనుభవాలను ఎదుర్కొని అనంతరం తన పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ మంచి కథలను ఎంపిక చేసుకొని వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన దూసుకుపోతోంది.

ఈ విధంగా సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి గత దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈమె నటుడు నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కాస్త డిప్రెషన్ కి లోనయ్యారు. ఈ క్రమంలోనే పూర్తిగా కెరియర్ పై దృష్టి పెట్టిన సమంత కాస్త ఎక్స్పోజింగ్ కూడా చేస్తున్నారు.విడాకులు కానంతవరకు తనకంటూ కొన్ని పరిధులు నియమించుకున్న సమంత ప్రస్తుతం ఆ పరిధులను చెరిపేసింది.

ఇకపోతే తన అద్భుతమైన నటనతోఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి సాయి పల్లవి. ఈమె కూడా కొన్ని ఫ్లాప్ సినిమాలను చూసినప్పటికీ, కథల ఎంపిక విషయంలోనూ ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు ఎలాంటి తావులేకుండా అచ్చం నిండుదనం ఉట్టిపడేలా ఉండే పాత్రలను ఎంపిక చేసుకొని తన ఖాతాలో బ్లాక్ బస్టర్ చిత్రాలను సొంతం చేసుకున్నారు.
సమంతని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయిపల్లవి…
ఈ క్రమంలోనే ఈ ఇద్దరి నటీమణుల మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ జరుగుతోంది. సమంత టాలెంట్ ఉన్నప్పటికీ ఎక్స్పోజింగ్ చేస్తూ సినిమా అవకాశాలను అందుకొని అగ్రతారగా కొనసాగుతున్నారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. సమంత పరిగెత్తి పాలు తాగే రకం అయితే… సాయి పల్లవి నిలబడి నీళ్లు తాగే రకం అని నెటిజన్లు వీరిద్దరి గురించి చర్చించుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోయిన్లు అయినప్పటికీ సమంత ఎక్స్ పోజింగ్ చేసి గుర్తింపు పొందగా సాయి పల్లవి ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా అగ్రహీరోయిన్ గా గుర్తింపు పొందడమే కాకుండా సమంత కన్నా సాయి పల్లవి విశేషమైన అభిమానులను సంపాదించుకుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.



























