Samantha నాగచైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకుని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. సమంత నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగచైతన్య పలు సందర్భాలలో నటి శోభితతో కలిసి కనిపించారు. ఇలా వీరి గురించి తరచు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టినప్పుడు కూడా ఈ వార్తలు గురించి శోభిత, నాగచైతన్య స్పందించలేదు.

ఇకపోతే తాజాగా వీరిద్దరూ నాగార్జున ఇంట్లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొని షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని నాగార్జున కూడా అధికారికంగా తెలియజేస్తూ వారిని నిశ్చితార్థపు ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇక నాగచైతన్య శోభిత నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత సైతం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
సమంత చేస్తున్న ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఈమె తన మాజీ భర్తను టార్గెట్ చేస్తూనే ఇలాంటి పోస్ట్ చేశారంటూ వైరల్ చేస్తున్నారు. కష్టాలను ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వారు ఎప్పుడు ఒంటరివాళ్లు కాదు గుర్తుపెట్టుకో. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సవాళ్లను వాళ్ళ పైనుంచి ఓ శక్తి కాపాడుతూ ఉంటుంది.. ఎల్లప్పుడూ ఆ శక్తి వారి చుట్టూ రక్షణగా ఉంటుంది.. అలాంటి టైంలో నీ మానసిక ధైర్యం చాలా గొప్పది మేమంతా మీ వెంటే ఉన్నాము అంటూ వినేష్ పోగట్ గురించి సమంత ఓ పోస్టు రాసుకు వచ్చింది.
శక్తి రక్షణ కవచంలా ఉంటుంది..
సమంత చేసిన ఈ పోస్ట్ వినేష్ పోగట్ గురించి అయినప్పటికీ ఇదే పోస్టు తన వ్యక్తిగత జీవితానికి కూడా సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఈమె తన మాజీ భర్త చైతన్యను కూడా టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ చేశారని అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన కెరియర్ పైనే పెడుతూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.



























