విద్యార్థులకు గుడ్ న్యూస్.. అన్ని సెంట్రల్‌ వర్సిటీలకు ఒకే పరీక్ష..!

0
111

కేంద్ర విద్యాశాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశాలను కల్పించబోతుంది. కేంద్ర విద్యాశాఖలో కార్యదర్శి హోదాలో పని చేసే అమిత్‌ఖరే స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. విద్యారంగంలో కీలక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతేడాది కేంద్రం నూతన విద్యావిధానం–2020ను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కేంద్రం హైయర్ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా సహాయంతో ఉన్నత విద్యా విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొనిరావాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉండగా ప్రస్తుతం వేటికి అవే ఎంట్రన్స్ పరీక్షకలను నిర్వహించుకుంటున్నాయి. ఇలా వేర్వేరుగా నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వమే పరీక్షలను నిర్వహించి సీట్లను భర్తీ చేయబోతుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సులకు నీట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సులకు కూడా ఒకే పరీక్ష నిర్వహించాలని గతంలో ప్రతిపాదన చేసింది. అయితే చాలా రాష్ట్రాలు కేంద్రం ప్రతిపాదనకు అంగీకారం తెలపలేదు. ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ఇకపై రాష్ట్రాలు ఎంసెట్ పరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. అయితే నిపుణులు సైతం ఈ విధానం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.

ఒక్కో రాష్ట్రంలో కాలేజీల్లో సీట్ల భర్తీకి ఒక్కో తరహా నిబంధనలు ఉన్నాయని అందువల్ల దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం మాత్రం ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహణ ద్వారా ఫీజుల భారం తగ్గుతుందని చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here