Great Khali: ఇటీవల అల్లు అర్జున్ సినిమా పుష్ప సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని సాంగ్స్ తో పాటు.. డైలాగ్స్ కూడా పెద్ద హిట్ అయ్యాయి. అందులో సమంత స్టెప్పులు వేసిన ఐటెం సాగ్ ఊ అంటావా సాంగ్ పెద్ద బంపర్ హిట్ కొట్టేసింది. దాని పేరడీ సాంగ్స్ కూడా ఎన్నో వచ్చాయి.

అవి కూడా యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ఇక తగ్గేదేలే అనే డైలాగ్ కూడా ఎంతో పాపులర్ అయింది. దీనిని ఇటీవల ఇండియన్ క్రికెటర్ ఆల్ రౌండర్ జడేజా తన మన్యానరిజంతో చెప్పిన విషయం తెలిసిందే.

అంతే కాదు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఆ డైలాగ్ ను చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అంతకు మందు డేవిడ్ వార్నర్ అదే అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం సినిమాలో బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా పాటకు కూడా డ్యాన్స్ వేశాడు. అప్పట్లో కూడా అతడిపై ప్రశంసలు కురిశాయి.
డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’ గౌరవం..
ఇక తాజాగా పుష్ప సినిమాలోని సామి సామి సాంగ్ కు రెజ్లర్ ది గ్రేట్ ఖలీ కూడా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. తన చేతులను అటూ.. ఇటూ కదుపుతూ.. డ్యాన్స్ వేశాడు. ప్రస్తుతం అతడికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఖలీ గురించి చెప్పాలంటే.. అతడు డబ్ల్యూడబ్ల్యూఈలో ఎంతో పాపులర్ అయ్యాడు. ఈ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు.
తర్వాత కరోనా కారణంతో అంతే కాకుండా.. అతడి కాంట్రాక్ట్ అనేది రెన్యూవల్ కాకవపోవడంతో దూరంగా ఉంటున్నాడు. అతడు పేద మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. తన భారీ ఖాయంతో మంత్ర ముగ్ధులను చేసేశాడు. అతడు పంజాబ్ లో పోలీసు ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూనే ఇలా.. రెజ్లింగ్ కెరీర్ కొనసాగించాడు. ఇక అతడు ఇటీవల హాల్ ఆఫ్ ఫేమ్ అనే గౌరవాన్ని 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి అందుకున్నాడు.
#SaamiSaami by @greatkhali @PushpaMovie @alluarjun @ThisIsDSP #Pushpa #PushpaTheRise #PushpaHindi pic.twitter.com/loP3LJoR5c
— NewsQube (@TheNewsQube) January 3, 2022

































