శాంసంగ్ సరికొత్త, ప్రత్యేక ఫీచర్లు కలిగిన ల్యాప్ టాప్ లను లాంచ్ చేసింది. శాంసంగ్ లాంచ్ చేసిన ఈ ల్యాప్ టాప్ లు ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మన దేశంలో కూడా లాంచ్ చేసింది. గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫాకు తర్వాతి వెర్షన్‌గా ఈ ల్యాప్‌టాప్‌లు లాంచ్ అయ్యాయి. వీటిలో 11వ తరం ఐ5, ఐ7 ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ లాంచ్ చేసిన ఈ ల్యాప్ టాప్ కి సంబంధించిన ఫ్రీ ఆర్డర్లను శాంసంగ్ అమెరికా వెబ్ సైట్లో లిస్ట్ అయ్యాయి. ఇందులో ఐ5 ప్రాసెసర్ వేరియంట్ రూ.63,000 ఉంది. ఐ7 ప్రాసెసర్ వేరియంట్ ధరను సుమారు రూ.77,700 నిర్ణయించారు. ఈ కొత్త వెర్షన్ ల్యాప్ టాప్ లు బ్లాక్, సిల్వర్ కలర్ లో లాంచ్ అయ్యాయి. అమెరికాలో నిర్ణయించిన ధరలే మన దేశంలో కూడా ఉండవచ్చని భావిస్తున్నారు.
శాంసంగ్ లాంచ్ చేసిన ఈ ల్యాప్ టాప్ ను టచ్ స్క్రీన్ తరహాలో కూడా ఉపయోగించవచ్చు. దీనిలో 13.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్ డిస్ ప్లేను అందించారు.ఐ5 ప్రాసెసర్ వేరియంట్లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌ను అందించారు. ఐ7 వేరియంట్లో 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఉంది.దీంతోపాటు 720పీ వెబ్ క్యామ్, డ్యూయల్ అరే మైక్రో ఫోన్లు, రెండు 1.5W స్పీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి.దీని మందం 0.55 అంగుళాలుగానూ, బరువు కేవలం 1.18 కేజీలు ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…