Sandhya Janak : హ్యాపీడేస్ సినిమాలో తమన్నా తల్లి పాత్రలో మెరిసిన సంధ్య జనక్ పుట్టింది పిఠాపురం. తెలుగు వారే అయినా తండ్రి రైల్వే ఉద్యోగి అవ్వడం వల్ల నార్త్ లో చదువు కొనసాగించారు సంధ్య జనక్. కలకత్తా లో చదివిన సంధ్య జనక్ చిన్న వయసులోనే స్టేజి నాటకాలు రాస్తూ నటిస్తూ ఉండేవారట. ఆ ఆసక్తి సినిమాల్లోకి వచ్చేలా చేసిందంటూ చెప్తారు. ఇక అనసూయ, మర్యాదరామన్న, వేదం, శ్రీరామరాజ్యం, గుండెజారి గల్లంతయ్యిందే, కొత్తజంట, అనామిక… ఇలా విజయవంతమైన సినిమాలన్నింట్లో ఆమె కనిపించారు. అందంగా, హుందాగా హీరో, హీరోయిన్లకు తల్లిగా అనేక పాత్రల్ని పోషించిన సంధ్యా జనక్ ఏడేళ్ల సినిమా కెరీర్ లో యాభై కి పైగా సినిమాల్లో నటించారు.

మైలేజ్ కోసం యూట్యూబ్ లో అలాంటి ఫేక్ వీడియోలు…
సినిమాల్లో ఈ మధ్య కాలం లో కొంచెం అవకాశాలు తగ్గాయంటూ చెప్పిన సంధ్య గారు సినిమాల్లో నటించిన వారిలో కొంతమందితో మంచి అనుబంధం ఉంది అంటూ చెప్పింది. సలోని, రష్మిక మందన చాలా క్లోజ్ అంటూ చెప్పిన సంధ్య గారు నాకు తెలియని శత్రువులు కూడా ఉండవచ్చేమో అంటూ చెప్పారు. యూట్యూబ్ లో నేను చనిపోయినట్లు కూడా వీడియోలను పెట్టారు. ఇక హీరో సుమన్ గారితో నా వీడియోలను క్రియేట చేసి పెట్టారు.

ఆ వీడియోలు మా దృష్టికి రావడంతో నా భర్త సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. హీరో సుమన్ గారు కూడా పోలీస్ కంప్లైన్ట్ ఇచ్చి వాటిని యూట్యూబ్ నుండి తొలగించేలా చేసారు. బహుశా ఆ ఘటన వల్ల నాకు అవకాశాలు తెలుగు సినిమాల్లో తగ్గాయేమో తెలియదు. ఇక ఇతర రాష్ట్రాలనుండి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు డిమాండ్ ఉండటం వల్ల ఇక్కడే ఉన్న వాళ్లకు అవాకాశాలు తగ్గుతున్నాయి అంటూ సంధ్య అభిప్రాయపడ్డారు.
































