సంఘవి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్టిర స్తానాన్ని సంపాదించుకున్న ఒకప్పటి నటి. శ్రీకాంత్ హీరోగా నటించిన “తాజ్ మహల్” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో “సింధూరం” సినిమాలో అమాయక యువతిగా నటించి కుర్రకారు గుండెల్ని పిండేసింది. ఆ తరువాత “ఆహా”, “సూర్యవంశం”, “సీతారామరాజు”, “మృగరాజు”, “సమరసింహారెడ్డి” ఇలా సుమారు ఒక నలభైకి పైగా సినిమాల్లో నటించింది.

పదిహేను ఏళ్లకు పైగా కొనసాగిన ఆమె కెరియర్ లో తెలుగుతో పాటు అనేక భాషల్లో నటించి అలరించింది. తెలుగులో చివరగా 2004 లో “ఆంధ్రావాలా” సినిమాలో నటించింది. ఆ తరువాత “ఒక్కడే కాని ఇద్దరు” అనే సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఆ తరువాత మరే సినిమాలోను నటించలేదు. అవకాశాలు తగ్గుతున్న సమయంలో 2016 లో వెంకటేష్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 39 సంవత్సరాలు. అయితే తాజగా ఒక పాపకి జన్మనిచింది. తన బిడ్డతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. అయితే 42ఏళ్ల వయసులో బిడ్డకు తల్లికావడంతో అభిమానులు కాస్త ఆశ్చర్యానికి గురవుతున్నా… తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here