సోరియాసిస్ బాధపడుతున్నారా..ఈ చెట్టు ఆకులతో ఉపశమనం..!

0
443

మల్లె జాతి మొక్కలుల్లో ఒకటైన సన్నజాజి పూలు సువాసనలు వెదజల్లుతూ మనసుకు ప్రశాంతతను కలిగించి మానసిక ఆనందాన్ని కలగజేస్తాయి.అందుకే సన్నజాజి పూల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచడానికి చాలామంది ఇష్టపడతారు.సన్నజాజి మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.ఈ మొక్కలోని ఆకులు, కాండం, పువ్వులు మరియు వేర్లలో అనేక రకాల వ్యాధులను నయం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

అందుకే ఆయుర్వేద వైద్యంలో కూడా సన్నజాజి పూలు విశిష్ట స్థానం పొందాయని చెప్పొచ్చు. సన్నజాజి పూల మొక్కలను ప్రాంతాలను బట్టి వైల్డ్ జాస్మిన్,వింటర్ జాస్మిన్ వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు.ప్రస్తుతం సన్నజాజి మొక్కను మరియు పూలను హెల్త్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సన్నజాజి పూలతో తయారయ్యే సబ్బులు, ఫేస్ క్రీములు, సువాసనలు వెదజల్లే పర్ఫ్యూమ్స్ వంటి వాటికి ప్రస్తుత మార్కెట్లో మంచి డిమాండ్ కలదు.

సన్నజాజి పూల పరిమళాలు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తాజాగా ఉంచి మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది.దాంతో అలసట,చిరాకు, ఆందోళన, తలనొప్పి, డిప్రెషన్ వంటి రుగ్మతలను దూరంగా తరిమివేయొచ్చు.అలాగే సన్నజాజి పూలతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. సన్నజాజి పూలలో ఉన్న ఔషధ గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది దాంతో శరీర బరువును నియంత్రించుకోని, గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.జాజిపూల టీ ప్రతి రోజూ సేవించడం వల్ల యాంటిడిప్రెసెంట్ మరియు కామోద్దీపన లక్షణాలను కలిగించడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

సన్నజాజి చెట్టు, వేర్లు,పూలలో యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.కావున సన్నజాజి ఆకులను మెత్తగా రుబ్బి తలకు పట్టించుకుంటే తలలో చుండ్రు సమస్య తగ్గి జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి.మరియు గజ్జి, తామర, సోరియాసిస్ వంటి అనేక రకాల చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. నోటి పుండ్లు, నోటిపూత వంటి సమస్యలతో బాధపడేవారు జాజి ఆకులను బాగా మరిగించి ఆ కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.