Varalakshmi: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి వరలక్ష్మి. ఇలా ఈమె హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో నెగిటివ్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలాంటి నెగటివ్ పాత్రలకు మంచి క్రేజ్ రావడంతో ఈమె ప్రస్తుతం అన్ని విలన్ గానే నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.

ఇలా ఒక వైపు నెగిటివ్ సినిమాలలో నటించడమే కాకుండా మరోవైపు ఈమె లేడీ ఓరియంటెడ్ పాత్రలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇకపోతే వరలక్ష్మి ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే జూలై 2వ తేదీ ఈమె వివాహం ముంబైలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే చెన్నైలో ఎంతో ఘనంగా వివాహ రిసెప్షన్ కూడా జరిగింది.
ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబ సభ్యులతో పాటు ఎంతోమంది సినీ సెలబ్రిటీలో కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తమిళనాడులో వరలక్ష్మి పెళ్లి గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న ఈమె పెళ్లి కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేసిందంటూ వార్తలు వస్తున్నాయి.
సింపుల్ గా పెళ్లి జరిగింది..
ఈ వార్తలపై శరత్ కుమార్ స్పందించారు. నా బిడ్డ పెళ్లి కోసం 200 కోట్లు ఖర్చు చేశానంటూ వార్తలు వస్తున్నాయి. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నా బిడ్డ పెళ్లి కోసం అంత మొత్తంలో తాను ఖర్చు చేయలేదని చాలా సింపుల్గా తన పెళ్లి చేశానని ఈయన తన కుమార్తె పెళ్లి ఖర్చు గురించి వస్తున్నటువంటి వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు.



























