Sarpanch Navya : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ప్రవీణ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మీద మరోసారి ఆరోపణలను చేసారు నవ్య. గతంలో నవ్య తన మీద ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించగా మీడియా, ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు రాజయ్య గారు ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పి నవ్య కుటుంబంతో మాట్లాడారు. అనంతరం సర్పంచ్ నవ్య, ఆమె భర్త ప్రవీణ్ తో కలిసి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఇపుడు తాజాగా మరోసారి నవ్య మీడియా ముందుకు వచ్చారు. 25 లక్షలు ఇస్తానని రాజయ్య మోసం చేసాడని తన భర్తను కూడా బుట్టలో వేసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు.

నా భర్థ నన్ను అమ్మేద్దాం అనుకున్నాడు…
ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య తన భర్తకు మాయమాటలు చెప్పి నాకు నా భర్తకు గొడవలు పెట్టారు అంటూ నవ్య ఆరోపించారు. నా భర్త ను నమ్మించి నాతోను నా భర్త తోనూ 25 లక్షల అప్పు తీసుకుంటున్నట్లు గతంలో ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని సంతకం చేయమని ఒత్తిడి చేసారు అంటూ నవ్య ఆరోపించారు.

గ్రామంలో అభివృద్ధి పనుల కోసం డబ్బు శాంక్షన్ చేస్తానని చెప్పి మాకు ఎమ్మెల్యే అప్పుగా ఇస్తున్నట్లు ఇప్పుడు మాట మార్చారు అంటూ చెప్పారు నవ్య. డబ్బు కోసం ఇలాంటి వాటిని నేను చేయలేను. నా భర్త డబ్బు కోసం నన్ను అమ్మేద్దాం అనుకున్నాడు, వాళ్ళ ట్రాప్ లో పడుంటే భవిష్యత్తులో నన్ను బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచారం కూడా చేయిస్తారు అంటూ, నేను న్యాయం కోసం పోరాడుతున్నాని ఎవరికీ భయపడేది లేదని నవ్య ఫైర్ అయ్యారు. నేను సంతకం పెడితే భవిష్యత్తులో నా పిల్లలను వేధించరని ఏంటి నమ్మకం, అప్పు తీసుకున్నారు మీ తల్లిదండ్రులు అని వారిని తప్పు దారి పట్టిస్తారు అంటూ నవ్య ఇంటర్వ్యూలో కంట తడి పెట్టుకున్నారు.


































