Sathya Master : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఇక ఆయన పెద్ద కర్మ కార్యక్రమాన్ని ఆయన శిష్యులు చేసారు.

ఆయన మరణానికి కారణం…
రాకేష్ మాస్టర్ చనిపోయాక ఆయన పెద్ద కర్మ కార్యక్రమాన్ని అయన శిష్యులైన శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ ఇద్దరూ బాగా చేసారు. తాజాగా సత్య మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ ఆయన చనిపోక ముందు ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ సత్య, శేఖర్ ఇద్దరూ నేను చనిపోతే ఎలా నటిస్తారో అంటూ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ నేను శేఖర్ అలాంటి మాటలను ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. ఆయన మా గురించి మంచి కోరుకునే విషయాలను మాత్రమే గుర్తు పెట్టుకున్నామని చెప్పారు. ఆయన మరణం గురించి చాలా మంది ఏవేవో కథనాలు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకోవాలి.

అయన ఒంటి మీద గాయాలు ఉన్నాయంటూ ఆయన అంత్యక్రియలు అయ్యాక చెప్పారు. నేను అయన శవాన్ని గమనించలేదు ఆయన మరణించారు నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచించాం కానీ అలాంటివేమి గమనించలేదు. ఆయన కుటుంబానికి అండగా నిలబడతాం, కొంతమంది ఆయన చుట్టూ చేరి తాగొద్ధు అని చెప్పాల్సింది పోయి తాగించి ఆయన చావుకు కారణం అయ్యారు ఆయనను కలిసినప్పుడు ప్రతి సారి తాగొద్దని మా సీనియర్స్ తో చెప్పించాం అంటూ సత్య మాస్టర్ తెలిపారు.































