Sathya Master : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. బషీర్ అనే కంటెస్టెంట్ కి ఢీ షోలో డాన్స్ మాస్టర్ గా ఉండేవాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు. ఇక ఆయన మంచితనం, సహాయ గుణం గురించి ఆయన శిష్యుల్లో ఒకరైన సత్యమాస్టర్ మీడియాతో పంచుకున్నారు.

శేఖర్ కి అన్నం పెట్టాడు…
రాకేష్ మాస్టర్ తన శిష్యులను చాలా బాగా చూసుకుంటారని ఆయన వల్లే ఇప్పుడున్న ఎంతో మంది డాన్స్ మాస్టర్లు పైకి వచ్చారని తెలిపారు. అయన తన శిష్యులను బాగా చూసుకునే వారని, అన్నం పెట్టి అందరించాడని తెలిపారు. నన్ను శేఖర్ ను కొడుకుల్లాగే చూసుకున్నారని తెలిపారు. మా సక్సెస్ చూసి కూడా చాలా గర్వ పడేవారని సత్య మాస్టర్ తెలిపారు. ఆయనకు కోపం అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతారని సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. ఆయన ఇప్పుడు ఉన్న వ్యక్తిలా కాదు ముందు వేరే విధంగా ఉండేవారు.

ఆయన తన బాయ్స్ ని బాగా చూసుకునే వారు. కోపమొస్తే ఏ మాస్టర్ అయినా తిడతాడు అలానే రాకేష్ మాస్టర్ కూడా. కానీ ఆ కోపం ఎక్కువ సేపు ఉండదు కాసేపటికే మళ్ళీ ఆయనే వచ్చి మాట్లాడేవాడు. ఇప్పుడు ఉన్నట్లు ఆయన ప్రవర్తన ఉండి ఉంటే శేఖర్ నేను అన్నేళ్ళు ఆయనతో ఎలా ఉండేవాళ్లం అంటూ సత్య మాస్టర్ చెప్పారు. ఆయన తన చివరి రోజుల్లో యూ ట్యూబ్ స్టార్ అయ్యారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండి ఉంటే బాగుండేది. డిప్రెషన్ వల్లే ఆయన తాగుడుకు అంత బానిస అయ్యాడు అంటూ రాకేష్ మాస్టర్ గురించి తెలిపారు.































