Satya Dev: సత్యదేవ్ హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాలలో సహాయ నటుడి పాత్రల్లో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా నాగ శేఖర్ దర్శకత్వంలో గుర్తుందా శీతాకాలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా తమన్నా వేదికపై మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోయిన్ సత్యదేవ్ కి ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. మరి మీ రియల్ లైఫ్ హీరోయిన్ ని పరిచయం చేయొచ్చు కదా అంటూ అడిగారు. ఇలా తమన్నా చెప్పేసరికి తన భార్య దీపిక అలాగే కుమారుడిని వేదిక పైకి తీసుకువచ్చి అందరికీ పరిచయం చేశారు.
సత్యదేవ్ భార్య దీపిక వేదిక పైకి రాగానే తమన్నా తనతో కలిసి ఎంతో సరదాగా మాట్లాడారు. ఇక సత్యదేవ్ తన భార్య దీపిక గురించి మాట్లాడటమే కాకుండా తనని వివాహం చేసుకున్నప్పటి నుంచి తనకు కాస్ట్యూమ్ డిజైనర్ గా తన భార్య దీపిక వ్యవహరిస్తున్నారని తెలిపారు.

Satya Dev: ప్రేమ వివాహం చేసుకున్న సత్యదేవ్…
ఇక గుర్తుందా శీతాకాలం సినిమాల్లో కూడా హీరో కాస్ట్యూమ్ డిజైనర్ గా, స్టైలింగ్ మొత్తం దీపికనే చూసుకున్నారని అందుకు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలిపారు. ఇక వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వివాహమైనప్పటి నుంచి దీపిక తన భర్త సత్యదేవకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.ఇక సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించి అందరిని మెప్పించారు.































